Sri Ram Sagar Project: ఎస్సారెస్పీ నుంచి ముందుగానే నీటి విడుదల
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:41 AM
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ సారి ముందుగానే ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది....
పెద్దపల్లి/చిన్న కోడూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ సారి ముందుగానే ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. ఈ నెల 7 నుంచే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు విడుదల చేస్తుండగా.. తాజాగా వరద కాల్వ ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. సాధారణంగా నిల్వ 45టీఎంసీలు దాటిన తర్వాతే.. కాల్వలకు విడుదల చేయడం పరిపాటి. కానీ, ఈసారి 40టీఎంసీలకు చేరగానే.. కాకతీయ ప్రధాన కాలువ, లక్ష్మి, సరస్వతీ కాలువలు, గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారు. తాజాగా ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో సోమవారం ఉదయం ఎస్సారెస్పీ గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలిపెట్టారు. కాగా, అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి సోమవారం ఒక పంపు ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు.