Share News

Ranganath: అమీర్‌పేట జోన్‌గా డ్రైనేజీ, నాలాలను మారుస్తాం

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:48 AM

వరద సమస్యలపై ఏళ్ల తరబడి సరైన పరిష్కారం చూపకపోవడంతోనే ఇప్పుడు వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో నీరు

Ranganath: అమీర్‌పేట జోన్‌గా డ్రైనేజీ, నాలాలను మారుస్తాం

వరద సమస్యలపై ఏళ్ల తరబడి సరైన పరిష్కారం చూపకపోవడంతోనే ఇప్పుడు వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో నీరు నిలుస్తోందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ప్రతి ఏటా కురుస్తున్న వానలకు, నీరు నిలిచిపోతున్న ప్రాంతాలను ఒకచోట నుంచి మరోచోటికి మార్చుకుంటూ వచ్చారని.. శాశ్వత పరిష్కారం చేయలేదని తెలిపారు. ఆ కారణంగానే అమీర్‌పేట, బౌద్ధనగర్‌, గంగుబాయిబస్తీల్లో వరద ప్రభావం పడిందన్నారు. ఇకపై ఇలాంటి సమస్య త లెత్తకుండా ఉండేందుకు అమీర్‌పేట జోన్‌లో ఉన్న డ్రైనేజీ, నాలా వ్యవస్థలో కీలక మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో సీఎం రేవంత్‌ కూడా పలు సూచనలు చేశారని, ఆ మేరకు కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. అమీర్‌పేట జోన్‌లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, నాలాలను ఒక యూనిట్‌గా తీసుకుని నెలలో సమగ్ర అధ్యయనం చేసి, ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అయితే ఈలోపు ఎమర్జెన్సీ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 04:48 AM