KKR Gautam Alumni Success: డాక్టర్ కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థుల విజయం
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:33 AM
జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించి సత్తాచాటారు. హేమంత్ అభిరామ్, వై. జశ్వంత్ చౌదరి, ఎల్. చెర్విత ఇతర విద్యార్థులతో పాటు 100లోపు 9 మంది ర్యాంకులు సాధించారు
హైదరాబాద్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు సత్తా చాటారని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. గతంలో తమ పాఠశాలలో చదివిన ఎన్.హేమంత్ అభిరామ్ ఆలిండియా 18వ ర్యాంకు, వై.జశ్వంత్ చౌదరి 22, ఎల్.చెర్విత 22వ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. వివిధ కేటగిరీల్లో 100లోపు 9 మంది ర్యాంకులు సాధించారని వివరించారు. ఘన విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హైస్కూల్ తరఫున అభినందనలు తెలిపారు.