Share News

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తిచేసి పంపిణీ చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:14 AM

గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్‌ చేశారు.

 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తిచేసి పంపిణీ చేయాలి
అయిటిపాముల వద్ద అసంపూర్తి ఇళ్లను పరిశీలిస్తున్న వీరారెడ్డి, నాయకులు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తిచేసి పంపిణీ చేయాలి

నార్కట్‌పల్లి, కట్టంగూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్‌ చేశారు. నార్కట్‌పల్లి మండలంలోని బీ.వెల్లెంల, అవురవాణి గ్రామాల్లో, కట్టంగూరు మండలంలోని అయిటిపాముల శివారులో గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా వదిలివేసిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తయిన ఇళ్లను అర్హులైన వారికి పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టారని, కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని అర్హులకు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల కార్యదర్శులు చింతపల్లి బయ్యన్న, పెంజర్ల సైదులు, నాయకులు చెర్కు పెద్దులు, కల్లూరి యాదగిరి, దండు రవి, సోమనబోయిన సైదులు, కల్లూరి కంఠ్లమహేశ్వర్‌, ముప్పిడి సత్యం, నాగచారి, నర్సింహ, రామలింగం, లింగయ్య, వెంకటయ్య, గంజి మురళి, సురేందర్‌, రవీంద్రచారి, రామస్వామి, శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:14 AM