Share News

ప్రశాంతమైన అచ్చంపేటను కలుషితం చేయొద్దు

ABN , Publish Date - Jan 21 , 2025 | 11:28 PM

ప్రశాంతంగా ఉన్న అచ్చంపేటను కలుషితం చేయొద్దని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

ప్రశాంతమైన అచ్చంపేటను కలుషితం చేయొద్దు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేట, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : ప్రశాంతంగా ఉన్న అచ్చంపేటను కలుషితం చేయొద్దని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బల్మూరు మండల పరిధి లోని మైలారం గ్రామంలోని గుట్టకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని అనుమ తుల కాగితాలు మీడియాకు చూపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులే తప్ప మా ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఇసుక దోపిడీ చేసి వందల కోట్ల రూపాయలు సంపా దించుకున్న నీవు, నన్ను ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాననడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అక్రమ సంపాదన, ల్యాండ్‌ మాపీ యింగ్‌ వంటివి తాను చేయలేదని, చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, యూత్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ అధ్యక్షు డు క్యామ మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2025 | 11:28 PM