Share News

కృష్ణా జలాలను తరలిస్తున్నా పట్టించుకోరా

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:39 AM

కృష్ణా జలాలను తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు.

 కృష్ణా జలాలను తరలిస్తున్నా పట్టించుకోరా
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి

కృష్ణా జలాలను తరలిస్తున్నా పట్టించుకోరా

ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి

హాలియా, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలను తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. హాలియాలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జునసాగర్‌ డ్యాం మీద సీఆర్‌పీఎఫ్‌ బలగాలను పెట్టి ఆంధ్రప్రదేశ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు జరుగుతున్నాయన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు ఆం రఽధా ప్రాంతానికి ఎంత, తెలంగాణ ప్రాంతానికి ఎంత అని తాత్కాలిక ఒప్పందం చేశారు. ఆంధ్ర ప్రాంతం వారు కేంద్రప్రభుత్వం సహకారంతో దానిని ఉల్లఘించి కేఆర్‌ఎంబీని మభ్యపెట్టి నీటిని తీసుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత ప్రభుత్వం అప్పటికప్పుడు లేఖ తయారు చేసి కేఆర్‌ఎంబికి పంపించిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా 11వేల క్యూసెక్కుల నీరు ఆంధ్రా ప్రాంతానికి వెళ్తూనే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నా నీటి కష్టాలు తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రైతుల పక్షాన ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌, బీజేపీలకు లేదని ఆయన విమర్శించారు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన ఎక్కలూరి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:39 AM