రక్తదానం చేయడం అభినందనీయం
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:33 PM
అవసరం ఉన్న వారి సంక్షే మం కోసం స్వచ్చందంగా రక్తదానం చేయడం అబినందనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : అవసరం ఉన్న వారి సంక్షే మం కోసం స్వచ్చందంగా రక్తదానం చేయడం అబినందనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీ కన్వెన్షన్ హాలులో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం కంటి పరీక్షల శిబిరానికి డీసీపీ భాస్కర్, జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్‌కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రా రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లా డుతూ అన్నిదానాల్లో కెల్లా రక్తదానం గొప్పదన్నారు. శిబిరంలో 53 మంది రక్తదానం చేశారని, రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. కార్యక్రమం లో ఎంవీఐ రంజిత్, ఖాసీం, సూర్యతేజ, రెడ్‌క్రాస్ సొసైటి సభ్యులు మహేందర్ పాల్గొన్నారు.
త్యాగధనుల సేవలు చిరస్మరణీయం
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్ర పోరాటంలో త్యాగ ధనులు చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురు వారం మహాత్మాగాంధీ వర్ధంతిని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. రెండు నిమిషాలు మౌనం పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.