Share News

డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:30 AM

ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ అన్నారు.

డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలి
నాగార్జునసాగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌

రాష్ట్ర వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌

దేవరకొండ, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని డీసీహెచ్‌ ఎస్‌ డాక్టర్‌ మాతృనాయక్‌తో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే ఓపీ సంఖ్య, డెలివరీ వివరాలు ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ రవిప్రకాష్‌ను అడిగి తెలు సుకున్నారు. వైద్యుల హాజరు పట్టికను పరిశీ లించారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌, రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల నుంచి 200పడకల ఆస్పత్రిగా పెంచనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో శానిటేషన్‌ సమస్యను పరిష్కరించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆసుపత్రికి ఆర్వోప్లాంట్‌తో పాటు డెంటల్‌ బెడ్‌ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం రోగులకు సరిపడా మందులు పంపిణీ చేస్తుందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, సాకులు చెప్పి వివిధ ఆస్పత్రులకు రెఫర్‌ చేయవద్దని డాక్టర్‌లను ఆదేశించారు. తెలంగాణలో 175 ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులు ఉన్నాయని ఆస్పత్రిలో త్వరలో 1600డాక్టర్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మాతృనాయక్‌, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిప్రకాష్‌, డాక్టర్‌ మంగ్తానాయక్‌, డాక్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

కాన్పుల్లో సిజేరియన్లు తగ్గించాలి

నాగార్జునసాగర్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులకు వచ్చే మహిళలకు సిజేరియన్‌ డెలివరీల సంఖ్య తగ్గించాలని రాష్ట్ర వైధ్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ వైద్యులకు సూచించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఏరి యా ఆస్పత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రుల డీసీహె చ్‌లు, సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏరియా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ హరికృష్ణ, ఆర్‌ఎంవో భానుప్రసాద్‌నాయక్‌, నల్లగొండ డీసీహెచ్‌ఎస్‌ మాతృనాయక్‌, సూర్యాపేట డీసీహెచ్‌ వెంకటేశ్వర్లు, యాదాద్రి డీసీహెచ్‌ చిన్నానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:30 AM