Share News

ముగిసిన ధనుర్మాసోత్సవాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:11 AM

జిల్లా కేంద్రంలోని ప లు వైష్ణవాలయాల్లో 30 రో జుల పాటు ని ర్వహించిన ధ నుర్మాస వ్రత మహోత్సవాలు ముగిశాయి.

 ముగిసిన ధనుర్మాసోత్సవాలు
పవళింపు సేవలో స్వామివారు

ముగిసిన ధనుర్మాసోత్సవాలు

స్వామివారి పవళింపు సేవ

నల్లగొండ క ల్చరల్‌, జనవ రి 15(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప లు వైష్ణవాలయాల్లో 30 రో జుల పాటు ని ర్వహించిన ధ నుర్మాస వ్రత మహోత్సవాలు ముగిశాయి. రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీమాన భాష్యం జగన్నాథచార్యులు ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఆండాళ్‌ అమ్మవారు రచించిన తిరుప్పావై పాశురాలను ప్రవచనం చేశారు. ప్రతీరోజు అమ్మవారి వ్రత విశేషాలను భక్తులకు వివరించారు. శ్రీగోదా రంగమన్నార్ల కల్యాణమహోత్సవం కన్నుల పండువగా సాగింది. మంగళవారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆలయంలోని అమ్మవారికి ఒడిబియ్యం, గోదా రంగనాథుల పవళింపు సేవ కార్యక్రమాలు, అర్చకస్వాములు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. దీంతో ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ధనుర్మాస ఉత్సవాల్లో ప్రవచనం చేసిన శ్రీమాన్‌ భాష్యం జగన్నాథచార్యులు, స్థానాచార్యులు, రామారంగాచార్యు లు, యాదగిరిచార్యులు, శఠగోపాలాచార్యులు, రఘునందనాచార్యులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పండితులను సత్కరించారు. అదేవిధంగా పానగల్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు భక్తితో సాగాయి. అదేవిధంగా వీటికాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఎంసీ పద్మ ఆధ్వర్యంలో 30రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలను భక్తితో చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, ఆలయ మాజీ చైర్మన బుర్రి చైతన్య, చకిలం వేణుగోపాల్‌రావు, సంధ్యారాణి, వికాస తరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:11 AM