Share News

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:47 AM

అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూ రి సంజయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌

జగిత్యాల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూ రి సంజయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల, రాయికల్‌ ప ట్టణాల్లోని అన్ని వార్డులలో, నూకపల్లి వద్ద డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇ ళ్లకు మిషన్‌ భగీరథ, అమృత్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా నిర్వ హించనున్న పలు అభివృద్ధి పనులపై సంబందిత శాఖల అధికారు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మా ట్లాడారు. పనులను త్వరితగతిన ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాల ని, ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తేవాలని సూచించారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బందులు తలె త్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్ర మంలో మున్సిపల్‌ కమిషనర్‌ చిరంజీవి, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ సంపత్‌ రావు, శేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

జగిత్యాల: కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ను గురువారం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కలిశారు. పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌లో నూ తన సంవత్సరం పురస్కరించుకొని కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్ర మాలపై చర్చించారు.

Updated Date - Jan 03 , 2025 | 12:47 AM