Share News

దేవరకొండ టూ నాగర్‌కర్నూల్‌

ABN , Publish Date - Jan 18 , 2025 | 01:12 AM

దేవరకొండ డివిజనలో రేషనబియ్యం అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. రేషనబియ్యం పక్కదారి పట్టిస్తే సంబంధిత డీలర్లు, రేషనకార్డు వినియోగదారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 దేవరకొండ టూ నాగర్‌కర్నూల్‌
అక్రమంగా తరలిస్తున్న రేషన బియ్యాన్ని పట్టుకున్న పౌరసరఫరాల, పోలీ్‌సశాఖ అధికారులు

దేవరకొండ టూ నాగర్‌కర్నూల్‌

జోరుగా రేషన బియ్యం అక్రమ రవాణా

అధికారులు తనిఖీలు చేసినా ఆగని వైనం

నామమాత్రంగా కేసులు

పట్టించుకోని అధికారులు

దేవరకొండ డివిజనలో రేషనబియ్యం అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. రేషనబియ్యం పక్కదారి పట్టిస్తే సంబంధిత డీలర్లు, రేషనకార్డు వినియోగదారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పౌరసరఫరాలశా ఖ, పోలీ స్‌ అధికారులు తనిఖీలు చేసి రేషన బి య్యాన్ని కేసులు నమోదు చేస్తున్నా బియ్యం అక్ర మ రవాణా కొనసాగుతూనే ఉంది. అక్రమంగా రేషనబియాన్ని తరలిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోకపోవడమే అందుకు ప్రధాన కారణం.

- (ఆంధ్రజ్యోతి,దేవరకొండ)

దేవరకొండ డివిజన నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లాకు జోరుగా రేషనబియ్యం అక్రమంగా రవా ణా అవుతుంది. దేవరకొండ డివిజనలోని ప్రధా న గోదాం నుంచి ప్రతి నెలా 10 వేల క్వింటాళ్ల రేషనబియ్యం 230 రేషన దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొంత మంది రేషన డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై రేషన బియ్యాన్ని విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఈ నెల 12వ తేదీన నాగర్‌కర్నూల్‌ జిల్లా బొల్లూరు గ్రా మానికి చెందిన నేనావత హరి దేవరకొండలో 30 క్వింటాళ్ల రేషనబియ్యాన్ని కొనుగోలు చేసి బొలొరో వాహనంలో నాగర్‌కర్నూల్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ డీటీసీఎస్‌ స్వాధీనం చేసుకొని 6ఏ కింద కేసు నమో దు చేశారు. ఆ రేషనబియ్యాన్ని దేవరకొండలో వినియోగదారుల వద్ద కొనుగోలు చేసి నాగర్‌కర్నూల్‌ జిల్లాకు తరలిస్తున్నట్లు పట్టుబడిన వ్యక్తి నేనావత హరి విచారణలో పేర్కొన్నాడు. రేషనబియ్యాన్ని అతనికి ఎవరు విక్రయించారనేది ఇప్పటివరకు అధికారులు తేల్చలేకపోయారు. దేవరకొండ పట్టణంలో గత సంవత్సరం నవంబరులో చంద్రన్న కాలనీలో 40 క్వింటాళ్ల రేషనబియ్యాన్ని విక్రయించడానికి సిద్ధంగా ఉంచారు. పౌరసరఫరాలశాఖ పోలీసులకు సమాచారం అందడంతో రేషన బియ్యాన్ని అక్కడే వదిలి పారిపోయారు. 40 క్వింటాళ్ల బియ్యాన్ని ఎవరు అక్రమంగా తరలిస్తున్నారనే విషయం ఇప్పటికీ తెలియరాలేదు. పోలీసు, పౌరసరఫరాలశాఖ అధికారులు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రేషనడీలర్లపై నిఘా ఏర్పాటు చేయకపోవడమే అక్రమ రవాణాకు కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. రేషన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నా దేవరకొండ డివిజనలోని చందంపేట, పీఏపల్లి, పోలేపల్లి, కొండమల్లేపల్లి, డిండి, దేవరకొండ, నేరేడుగొమ్ము మండలాల్లో రేషనబియ్యం పక్కదారి పడుతున్న సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. గతేడాది ఆగస్టు నెలలో నాగర్‌కర్నూల్‌కు తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన బియ్యాన్ని డీటీసీఎస్‌ శ్రీనివాస్‌ పట్టుకొని విచారణ చేపట్టారు. ఆ బియ్యం దేవరకొండ పట్టణంలోని 12వ రేషన దుకాణం నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లుగా విచారణలో నిర్ధారణ అయింది. దీంతో పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టణంలోని 12వ రేషనషాపు డీలర్‌ సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. అతడిని విధుల నుంచి మరో డీలర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 3వ తేదీన పీఏపల్లి మండలం నుంచి కొండమల్లేపల్లికి ట్రాలీ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన బియ్యాన్ని కొండమల్లేపల్లి ఎస్‌ఐ రాంమూర్తి పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇలాంటి సంఘటనలు డివిజనలో తరుచూ జరుగుతున్నా ఉన్నతాధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా రేషన బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రేషన బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

రేషనబియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సంబంధిత రేషన డీలర్లపై చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు రేషన దుకాణాల్లో పంపిణీ చేసిన బియ్యాన్ని ఇతరులకు అమ్మితే రేషనకార్డులు రద్దు చేస్తాం. ఇప్పటికే తనిఖీలు నిర్వహించి రేషనబియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఒకే వ్యక్తి రెండు సార్లు పట్టుబడితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తాం.

- హనుమంతు శ్రీనివా్‌సగౌడ్‌, డీటీసీఎస్‌, దేవరకొండ

Updated Date - Jan 18 , 2025 | 01:12 AM