Mallu Ravi Said Democracy Being Undermined: పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:05 AM
ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల ఫోరం..
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల ఫోరం తెలంగాణ కన్వీనర్ మల్లు రవి ఆరోపించారు. పార్లమెంట్ క్వశ్చన్ అవర్‌లో కనీసం ప్రశ్నలు అడిగే సమయం కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం సభను వాయిదా వేసేసి, సాయంత్రం మళ్లీ ప్రారంభించి ముగిస్తున్నారని, ఇది సభ నడిపే పద్ధతేనా అని ప్రశ్నించారు. ఇంతటి నియంతృత్వ పాలన రాజుల కాలంలోనూ చూడలేదన్నారు. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ రాహుల్ గాంధీతోనే సాధ్యమని అన్నారు. కాగా, మానసిక వికలాంగుల భద్రతకు ఐరిస్ టెక్నాలజీ అమలు చేయాలని ఎంపీ కడియం కావ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే, అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని మంత్రి బీఎల్ వర్మ సమాధానమిచ్చారు.