Damodara Rajanarsimha: ఔషధాలపై తప్పుదోవ పట్టించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోండి: దామోదర
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:09 AM
ఔషధాల విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఔషధాల విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. డీసీఏ పనితీరుపై మంగళవారం వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి కేసులోనూ దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తూ, ఔషధాలు అమ్మకాలు జరుపుతున్న కంపెనీలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పదే పదే నిబంధనలు ఉల్లఘింస్తున్న సంస్థలను చట్టప్రకారం శాశ్వతంగా మూసివేయాలని సూచించారు. త్వరలో మరిన్ని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.