Damodara Rajanarsimha: ప్రజలకు తక్షణ వైద్య సాయం అందాలి: దామోదర
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:12 AM
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్యానికి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు(డీఎం అండ్ హెచ్‌ఓ) అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్యానికి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు(డీఎం అండ్ హెచ్‌ఓ) అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు తక్షణ వైద్య సాయం అందాలని, ఇందుకు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత జిల్లాల డీఎం అండ్ హెచ్‌ఓలతో మంత్రి దామోదర రాజనర్సింహ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు అధికంగా కురుస్తున్న మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేటతోపాటు ఇతర జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని అదేశించారు.