Share News

CPI : అట్టడుగు వర్గాల బాగోగులు మోదీకి పట్టవు

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:34 AM

తమ చెమట చుక్కలను ధారపోసి దేశ సంపదను సృష్టిస్తున్న 90 శాతం మంది దళిత, ఆదివాసీ, అట్టడుగు శ్రామిక వర్గాల బాగోగులు ప్రధాని మోదీకి పట్టవని సీపీఐ జాతీయ ప్రధాన

 CPI : అట్టడుగు వర్గాల బాగోగులు మోదీకి పట్టవు

దేశ సంపద కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం: డి. రాజా

ఖైరతాబాద్‌, హైదరాబాద్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తమ చెమట చుక్కలను ధారపోసి దేశ సంపదను సృష్టిస్తున్న 90 శాతం మంది దళిత, ఆదివాసీ, అట్టడుగు శ్రామిక వర్గాల బాగోగులు ప్రధాని మోదీకి పట్టవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శించారు. పేదలు కాయకష్టంతో సృష్టించిన సంపదను కార్పొరేట్‌ శక్తులకుఽ ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం (ఏఐడీఆర్‌ఎం)జాతీయ రెండో మహాసభలు సోమవారం ప్రారంభమయ్యా యి. మహాసభలను డి.రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజా మా ట్లాడుతూ.. దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించేందుకు వామపక్ష, ప్రగతిశీల శక్తులన్నీ ఏకంకావాలని రాజా పిలుపునిచ్చారు. సంస్థ జాతీయ అధ్యక్షుడు రామ్మూర్తి, దళిత సోషల్‌ ముక్తి మంచ్‌ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాధాకృష్ణన్‌, ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 05:34 AM