Share News

భరోసా కేంద్రాన్ని సందర్శించిన సీపీ

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:30 PM

నస్పూర్‌లోని పాత పోలీస్‌ స్టేషన్‌ భవనంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్‌ సోమవారం సందర్శించారు. కేం ద్రం నిర్వహణ, కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. బాధితులను అక్కున చేర్చుకోవాలని, తక్షణమే వారికి సూచన లు, సలహాలు, సహాయం అందించాలని సూచించారు. లీగల్‌, మెడి కల్‌, చిన్నారుల కౌన్సిలింగ్‌ గదులు, స్టేట్‌మెంట్‌ రికార్డు సమావేశం గదులను పరిశీలించారు.

భరోసా కేంద్రాన్ని సందర్శించిన సీపీ
నస్పూర్‌లోని భరోసా కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న సీపీ శ్రీనివాస్‌, పక్కన డీసీపీ భాస్కర్‌

బాధితులకు సహాయం అందించాలని సూచన

నస్పూర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్‌లోని పాత పోలీస్‌ స్టేషన్‌ భవనంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్‌ సోమవారం సందర్శించారు. కేం ద్రం నిర్వహణ, కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. బాధితులను అక్కున చేర్చుకోవాలని, తక్షణమే వారికి సూచన లు, సలహాలు, సహాయం అందించాలని సూచించారు. లీగల్‌, మెడి కల్‌, చిన్నారుల కౌన్సిలింగ్‌ గదులు, స్టేట్‌మెంట్‌ రికార్డు సమావేశం గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్‌ మాట్లాడు తూ పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లో బాదితులకు తక్షణమే న్యాయం సహాయం అందే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం నుం చి పరిహారం ఇప్పించడం వంటి సేవలు అందించి బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బాధితులకు న్యాయపరమైన సూచనలు అందించి వారికి ఏవరూ లేనప్పుడు భరోసా కేంద్రంలోనే ఆశ్రయం కల్పించాల న్నారు. అంతే కాకుండా కేంద్రంలోనే బాధితులకు నైపుణ్యాలను నే ర్పించి సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడుతున్న య న్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌, అడిషి న ల్‌ డిసీపీ (అడ్మిన్‌) సి. రాజు, స్ఫెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేం ద్ర రావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, మహిళా పోలిస్‌ స్టేషన్‌ ఇన్స్‌పెక్ట ర్‌ నరేష్‌ కుమార్‌, రూరల్‌ సీఐ ఆకుల అశోక్‌, షీ టీమ్‌ ఇన్‌చార్జి హై మా, సీసీ హరీష్‌, స్థానిక ఎస్సై నెల్కి సుగుణాకర్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:30 PM