Share News

పత్తి కొనుగోలు లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:10 AM

జిల్లాలో పత్తి కొనుగోలు లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం చెన్నూరు మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యా లయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్‌ మల్లికార్జున్‌తో కలిసి జిన్నింగు మిల్లుల యాజమా నులతో సమీక్ష నిర్వహించారు.

పత్తి కొనుగోలు లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పత్తి కొనుగోలు లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం చెన్నూరు మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యా లయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్‌ మల్లికార్జున్‌తో కలిసి జిన్నింగు మిల్లుల యాజమా నులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పత్తి కొనుగోలు కొరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని తెలిపారు. ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాళుకు రూ. 7521 నిర్ణయించడం జరిగిందని, దళారులను నమ్మి మోసపోకుండా రైతులు కొను గోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి లబ్ది పొందా లని తెలిపారు. జిన్నింగు మిల్లుల యాజమానులు ప్రభు త్వ నిబందనల ప్రకారం రక్షణ చర్యలు తీసుకోవా లని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరి గేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పత్తి నిలువ పేరుకు పోకుండా చూడాలని, పత్తిమిల్లులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన 7 రోజుల్లోగా ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. పత్తి కొనుగోలు, ప్రెస్సింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మోహన్‌, సీసీఐ అధికారులు, ఏఈవోలు జిన్నింగు మిల్లుల నిర్వహకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:10 AM