Share News

కోర్‌ ఇంజనీరింగ్‌లో ఉద్యోగావకాశాలు పుష్కలం

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:19 AM

ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్న కోర్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లలో ప్రవేశాల సంఖ్య తక్కువగా ఉంటోందని, అయితే తక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలుండే కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో..

కోర్‌ ఇంజనీరింగ్‌లో ఉద్యోగావకాశాలు పుష్కలం

  • తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్న కోర్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లలో ప్రవేశాల సంఖ్య తక్కువగా ఉంటోందని, అయితే తక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలుండే కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో అడ్మిషన్లు అధికంగా ఉంటున్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) చైర్మన్‌ బాలకిష్టారెడ్డి అన్నారు. శనివారం ఇంజనీరింగ్‌ అడ్మిషన్లపై టీజీసీహెచ్‌ఈ, జేఎన్‌టీయూ సంయుక్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోరుకునే తల్లిదండ్రులు కోర్‌ ఇంజనీరింగ్‌ విభాగాల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కోర్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ల్లో చేరిన విద్యార్థులు కూడా కృత్రిమ మేధ, ఆటోమేషన్‌, డ్రోన్‌ టెక్నాలజీ, బ్లాక్‌చైన్‌ వంటి సాంకేతికతలపై అవగాహన పెంచుకోవాలన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 04:19 AM