నత్తనడకన ఫ్లైఓవర్ నిర్మాణం
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:06 AM
రహదారుల వెంట ప్రమాదాలు జరగకుండా చూడటమే కాకుండా ప్రయాణాలు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందు లో భాగంగా పట్టణంలోని మర్రిగూడ బైపాస్ పరిధిలో చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై సుమారు రెండేళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడం లేదు. ఫలితంగా ట్రాఫిక్ కష్టాలతో పాటు నిత్య ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం నిర్మాణాలను పూర్తి చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపనులు వినిపిస్తున్నాయి.
నత్తనడకన ఫ్లైఓవర్ నిర్మాణం
రెండేళ్లుగా కొనసాగుతున్న మర్రిగూడ బైపాస్ ఫై ఓవర్ పనులు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
పెరుగుతున్న ప్రమాదాలు
రహదారుల వెంట ప్రమాదాలు జరగకుండా చూడటమే కాకుండా ప్రయాణాలు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందు లో భాగంగా పట్టణంలోని మర్రిగూడ బైపాస్ పరిధిలో చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై సుమారు రెండేళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడం లేదు. ఫలితంగా ట్రాఫిక్ కష్టాలతో పాటు నిత్య ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం నిర్మాణాలను పూర్తి చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపనులు వినిపిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి,నల్లగొండటౌన)
జిల్లా కేంద్రంలోని చర్లపల్లి సమీపంలో ఉన్న మర్రిగూడ బైపాస్ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనాల తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని బైపా్‌సపై వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా మర్రిగూడ బైపాస్ వద్ద రూ. 45కోట్ల అంచనా వ్యయంతో 2023 అక్టోబరు 2న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సుమా రు అర కిలోమీటరు పైగానే ఫ్లైఓవర్ నిర్మాణా న్ని పనులు ప్రారంభించారు. రెండేళ్లు గడుస్తు న్నా ఫ్లైఓవర్ నిర్మాణంలో వేగం కనిపించడం లేదు. అధికారులు, కాంట్రాక్టర్లు సైతం నిర్మాణం లో అలసత్వం వహిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే పనులు ప్రారంభమైన కొద్ది రోజలకు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రావడం ప్రభుత్వాలు మారడం వంటివి చకచకా జరిగిపోయాయి. అయితే నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణంలో చిన్న చిన్న మార్పులతో అంచనా వ్యయం కాస్తా రూ.65 కోట్లకు పెంచింది. అయినా పనులు పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆ మార్గం గుండా వచ్చే వాహనాదారులు నిత్యకష్టాలను అనుభవిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే మర్రిగూడ బైపాస్ వద్ద వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంది.
వాహనాలను దారి మళ్లించడంతో....
అద్దంకి బైపాస్ రోడ్డు ప్రదాన రహదారి కావడంతో అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కార్లతో పాటు భారీ వాహనాలు వస్తుంటాయి. మర్రిగూడ బైపాస్ వద్ద ట్రాఫిక్ డైవర్షన సూచికల లోపంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడ వైపు నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ సర్కిల్ నుంచి నల్లగొండ వైపు సుమారు 50 మీటర్లకు పైగా వచ్చి తిరిగి నార్కట్‌పల్లి వైపు మళ్లించి హైవేపైకి వెళ్లాల్సి వస్తుండటంతో హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై వాహనాలు వేగంగా వస్తుండటం ఒక్కసారిగా డైవర్షన రావడంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఇదే తరహాలో ట్రావెల్స్ బస్సు కూడా బోల్తా కొట్టగా పలువురు క్షతగాత్రులయ్యారు. దీనికి తోడు మర్రిగూడ బైపాస్ నుంచి పిట్టంపల్లి, కట్టంగూరు రోడ్డుకు సైతం ఇదే ప్రాంతం గుండా దారి ఉండటం, ఈ బైపాస్ వద్దనే రెండు ఫంక్షన హాల్స్ ఉండటంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటం ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది.
ఫ్లై ఓవర్ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని. ఈ పనులు ప్రారంభించిన దగ్గరి నుంచి ట్రాఫిక్‌కు చా లా ఇబ్బందిగా ఉంది. మర్రిగూ డ బైపాస్ వద్దకు రాగానే మూడు వైపుల నుంచి వచ్చే వాహనాలన్నీ ఒక్క దగ్గరికీ రావడంతో రోడ్డు క్రాస్ చేయాలంటే ఇబ్బందిగా మారుంతి. వాహనాల వేగానికి బైపాస్ వద్ద విపరీతమైన దుమ్ము లేస్తోంది. ఇది కళ్లలో పడి రహదారి కూడా కనిపించడం లేదు. దీంతో వెనుక నుంచి వాహనాలతో ఇబ్బందులలు ఎదురవుతున్నాయి.
పి. వెంకన్న, అన్నెపర్తి
విద్యుత లైన్ల కారణంగా పనులు నిలిచిపోయాయి
మర్రిగూడ బైపా్‌సలో నార్కట్‌పల్లి -అద్దంకి రహదారిలో చేపట్టిని ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పను లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. విద్యుత లైన్ల నిర్మాణ పనులకు ఆటంకంగా మారడంతో కొన్ని రోజులుగా పనులు నిలిచిపోయాయి. విద్యుత శాఖ అధికారులు కూడా ప్రస్తుతం విద్యుత హెచటీ లైన్లకు క్లియరెన్స ఇచ్చారు. తిరిగి పనుల ను ప్రారంభించి ఈనెలాఖరులోగా పూర్తిచే స్తాం. ఇప్పటికే ప్రారంభంలో ఉన్న అంచనా వ్య యాన్ని కూడా మార్చి రూ. 65 కోట్లకు పెంచడం జరిగింది. ప్రస్తుతం నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు. సకాలంలో పనులు పూర్తి చేసి ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తీసుకవస్తాం.
యాకూబ్, ఈఈ, ఆర్‌అండ్‌బీ