Share News

చెన్నూరులో బస్‌ డిపో నిర్మాణం చేపట్టాలి

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:24 PM

చెన్నూరులో ఆగిపోయిన బస్‌ డిపో నిర్మాణం తక్షణమే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు న గునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం చెన్నూరులో అసం పూ ర్తిగా ఉన్న బస్‌ డిపో నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు.

చెన్నూరులో బస్‌ డిపో నిర్మాణం చేపట్టాలి
బస్‌ డిపో ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌

చెన్నూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరులో ఆగిపోయిన బస్‌ డిపో నిర్మాణం తక్షణమే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు న గునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం చెన్నూరులో అసం పూ ర్తిగా ఉన్న బస్‌ డిపో నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. చెన్నూరు ప్రాంత ప్రజల చిరకాల వాంచ అయిన బస్‌ డిపో నిర్మా ణం ఆగిపోవడం శోచనీయమన్నారు. ఇటీవల ప్రారంభించిన పను లు ఆగిపోవడంతో ప్రజల ఆశ నిరాశే అయ్యిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బస్సు డిపో నిర్మాణం 80 శాతం పూర్తి అయ్యిందని, స్థా నిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే బస్‌ డిపో నిర్మాణం పూర్తి చేయాలన్నారు. చెన్నూరుకు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే హైద్రాబాద్‌కు ఉదయం వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో గోదావరి ఖని, మంచిర్యాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. చెన్నూరు నుంచి మహారాష్ట్ర, కాళేశ్వరం, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు రద్దీ ఎక్కువగా ఉన్న దృష్య్టా ప్రభుత్వం స్పందించి నిలిచిపోయిన బస్‌ డిపోను వెం టనే పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు జాడి తి రుపతి, జిల్లాప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్‌, రమేష్‌, శ్రీనివాస్‌, శ్రీపాల్‌, శివకృష్ణ, వంశీ, రామయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:24 PM