Share News

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా కాంగ్రెస్‌ పాలన

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:27 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అస్తవ్యస్తంగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బం డి సంజయ్‌ పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని ఎంఎన్‌ ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా కాంగ్రెస్‌ పాలన

మందమర్రిరూరల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అస్తవ్యస్తంగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బం డి సంజయ్‌ పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని ఎంఎన్‌ ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాం గ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒక్కటేనని, రెండు పార్టీలు ప్రజలకు ఇ చ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయన్నారు. రాబో యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని, బీజేపీ ఎమ్మెల్సీ అ భ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకూ నిరుద్యోగం పెరుగుతోందని, ప్రభుత్వం కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించడంలేదని మండిపడ్డారు. ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీ ఆర్‌ రాష్ట్రాన్ని సగం దోచుకుంటున్నారని, ఇప్పుడు సగం కాంగ్రెస్‌ దోచు కుంటోందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమురయ్య, అంజి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జి ల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు వెరబెల్లి ర ఘునాధ్‌, ఆరుముళ్ల పోశం, దుర్గం అశోక్‌, శ్రీనివాస్‌, కృష్ణ, వేణు, దీక్షితులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:27 PM