Share News

బీసీలను అణిచివేసే కుట్ర చేస్తున్న కాంగ్రెస్‌

ABN , Publish Date - Feb 09 , 2025 | 12:00 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన పేరుతో బీసీలను అణిచివేసే కుట్రలు చేస్తుందని మున్నురుకాపు సంఘ నాయకులు పుట్ట కిశోర్‌, నల్లకుంట్ల అయోధ్య, డేగాల జనార్థన్‌ అన్నారు.

బీసీలను అణిచివేసే కుట్ర చేస్తున్న కాంగ్రెస్‌
సమావేశంలో మాట్లాడుతున్న మున్నురుకాపు సంఘం నాయకులు

సూర్యాపేటటౌన్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన పేరుతో బీసీలను అణిచివేసే కుట్రలు చేస్తుందని మున్నురుకాపు సంఘ నాయకులు పుట్ట కిశోర్‌, నల్లకుంట్ల అయోధ్య, డేగాల జనార్థన్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మశాలీ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీసీల సామాజిక, ఆర్థిక ఎదుగుదలను చూడలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుల తడకల లెక్కలతో బీసీలకు అన్యాయం చేసిందన్నారు. గతంలో చేపట్టిన బీసీల సంఖ్య ప్రస్తుతం తగ్గించడం దారుణమన్నారు. బీసీలను లెక్కల్లో తక్కువ చూపిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను హత్య చేసిందని వెంటనే కాంగ్రెస్‌పై కేసు నమోదు చేయాల న్నారు. బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వెంటనే కులగణన మళ్ళీ చేపట్టాలని లేకుంటే రాజ్యాంగ బద్దంగా బీసీల హక్కుల కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దంతాల వెంకటేశ్వర్లు, దంతాల రాంబాబు, సుమద్రాల మనోహర్‌బాబు, గోనె సందీప్‌, కడియం శ్రీను, గోనె అశోక్‌, కొండల్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 12:00 AM