Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి : శంకర్‌నాయక్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:20 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అన్నారు.

 కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి : శంకర్‌నాయక్‌
హాలియాలో రేవంతరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న శంకర్‌నాయక్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి : శంకర్‌నాయక్‌

హాలియా, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అన్నారు. ప్రభుత్వం రైతు భరోసా ప్రకటించడంతో సోమవారం హాలియాలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతీ ఎకరానికి ఎలాంటి షరతులు లేకుండా రూ.12వేలు, భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా నెలకు వెయ్యి చొప్పున ఏడాదికి రూ. 12 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా పని చేస్తుందన్నారు. అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన తమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన కాకునూరి నారాయణగౌడ్‌, నాయకులు వెంపటి శ్రీనివాస్‌, గౌని రాజారమే్‌షయాదవ్‌, ప్రసాద్‌నాయక్‌, మజార్‌ మొయినుద్దీన, జూపల్లి శ్రీను, భానుచందర్‌రెడ్డి, నెర్మటి వెంకట్‌రెడ్డి, సైదులుమాదిగ, శ్రీనివాస్‌, నాగిరెడ్డి, నర్సింహ, రమణారెడ్డి, నామని సుధాకర్‌, యడవల్లి రంజిత, రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, జనార్దన, అశోక్‌, శ్రీనివాసులు, శేఖర్‌, ముత్యాలు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 01:20 AM