Telangana Government: జీపీవోల నియామకాలు ఉన్నట్టా లేనట్టా
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:39 AM
గ్రామపాలనాధికారుల(జీపీవో) నియామకాలపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15న 5 వేల మంది జీపీవోలకు
గందరగోళంలో రెవెన్యూ సిబ్బంది
ఆగస్ట్ 15న కార్యక్రమం లేదని సీసీఎల్‌ఏ స్పష్టీకరణ
హైదరాబాద్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): గ్రామపాలనాధికారుల(జీపీవో) నియామకాలపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15న 5 వేల మంది జీపీవోలకు నియామక పత్రాలు ఇచ్చేందుకు అదే రోజు మధ్యాహ్నాం 2 గంటలకు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరందు అదనపు కలెక్టర్లను(రెవెన్యూ) ఆదేశించారు. జిల్లాల నుంచి బస్సుల్లో జీపీవోలను తరలించాలని, వారితోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు కూడా హైదరాబాద్ రావాలని సూచించారు. అయితే వర్షాలు ఉన్నందున రెవెన్యూ సిబ్బంది అంతా జిల్లాలు వదిలి వస్తే ఇబ్బందులు ఉంటాయని కొంత మంది అదనపు కలెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ తరుణంలో పంద్రాగస్టున ఈ కార్యక్రమం ఉందా లేదా అనే అయోమయం ఏర్పడింది. దీనిపై సీసీఎల్‌ఏ అధికారులను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. ఆగస్టు 15న కార్యక్రమం లేదని స్పష్టం చేశారు.