Share News

TGSET 2025 : టీజీసెట్‌- 2025ను వెంటనే నిర్వహించండి

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:48 AM

ఈ ఏడాది జూన్‌ ఆఖర్లో టీజీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ల పరీక్షలకు కొత్తగా పీజీ పూర్తిచేసుకున్న నిరుద్యోగులకు కూడా అవకాశం ఉండేలా టీజీ సెట్‌- 2025 పరీక్షను

TGSET 2025 : టీజీసెట్‌- 2025ను వెంటనే నిర్వహించండి

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్‌ ఆఖర్లో టీజీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ల పరీక్షలకు కొత్తగా పీజీ పూర్తిచేసుకున్న నిరుద్యోగులకు కూడా అవకాశం ఉండేలా టీజీ సెట్‌- 2025 పరీక్షను వెంటనే నిర్వహించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. దాంట్లో భాగంగా ఈ ఏడాది జూన్‌ ఆఖర్లో టీజీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్లతో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలంటే పీజీ పూర్తిచేసిన వారు టీజీ సెట్‌ పరీక్ష అర్హత సాధించాల్సి ఉంది. రాష్ట్రంలోని అనేక వర్సిటీల్లో గత ఏడాది ఆఖర్లో పీజీ పూర్తిచేసుకున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కొత్తవారు కూడా పోటీ పరీక్షలకు హాజరయ్యేలా టీజీ సెట్‌ పరీక్ష వెంటనే నిర్వహించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jan 08 , 2025 | 04:48 AM