Share News

ఆపరేటర్ల అవస్థలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:14 AM

తక్కువ వేతనంతో ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్న ఈ సేవా (మీసేవ) కేంద్రాల్లో పనిచేస్తున్న ఆపరేటర్ల పరిస్థితి అధ్వానంగా మారిం ది.

 ఆపరేటర్ల అవస్థలు
ఈ సేవా (మీసేవ) సెంటర్‌

ఆపరేటర్ల అవస్థలు

తక్కువ వేతనంతో వెట్టిచాకిరి

పురోగతి లేని జీవితాలు

నల్లగొండ రూరల్‌, జనవరి 15 (ఆంధజ్యో తి): తక్కువ వేతనంతో ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్న ఈ సేవా (మీసేవ) కేంద్రాల్లో పనిచేస్తున్న ఆపరేటర్ల పరిస్థితి అధ్వానంగా మారిం ది. 2004లో చంద్రబాబు ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో ప్రజలకు సేవలు నేరుగా అందించేందకు ఈసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వం నేరుగా ఈసేవా కేంద్రాలను నిర్వహించకుండా ఇతర ఏజెన్సీలకు అప్పగించారు. వాటిని నిర్వహించేందుకు గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రాంచైజీల ద్వారా కొంతమంది నిరుద్యోగ యువకులకు అప్పగించారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ప్రభుత్వం భవనాలను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. అందుకోసం నిరుద్యోగ యు వకులను నియమించుకున్నారు. ఈ నియామ కం కూడా ఏజెన్సీలు కాకుండా జిల్లా అధికారుల సమక్షంలో వారిని నియమించుకోవడంతో పా టు, నగదును బ్యాంకుల్లో జమ చేసేందుకు అధికారులు పర్యవేక్షించారు. మేనేజర్‌, ఆపరేటర్లను రిక్రూట్‌మెంట్‌ చేసుకున్న సమయంలో వారికి వేతనాలు ఆపరేటర్‌కు రూ. 1200, మేనేజర్‌కు రూ. 1500 చొప్పున వారికి వేతనాలు అందజేశారు. అప్పటి నుంచి 20 సంవత్సరాల కాలంలో నాలుగు ఏజెన్సీలు మారాయి. మొదటగా సీఎంఎస్‌, హెచసీఎల్‌ శ్రీవెన. నెటెక్సల్‌, ప్రస్తుతం ప్రభుత్వం మీసేవ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ద్వారా వారికి వేతనా లు అందుతున్నాయి. 20 సంవత్సరాల కాలంలో రూ.1200 నుంచి రూ. 12వేల వరకు వేతనాలు పెరిగాయి. వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఇన్సూరెన్స, హెల్త్‌కార్డులు సౌకర్యాలు కల్పించలేదు. మారుతున్న కాలంలో ఒక కుటుంబ పోషణకు కుటుంబాలు గడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారిని ప్రభుత్వం సంస్థ ఉద్యోగుల గుర్తించి, కనీసం రూ.30 వేలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీసేవాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఎస్‌ఎటీస్‌ ఆ ధ్వర్యంలో పట్టణ పాంత్రాల్లో ఆరు కేంద్రాల ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ప్రభుత్వ మీసేవా (ఈసేవా) కేంద్రాలను నిర్వహిస్తున్నా రు. నల్లగొండ పట్టణంలో రెండు కేంద్రాలు అందులో 1 మేనేజర్‌, 4 ఆపరేటర్లు ఉన్నారు. మిర్యాలగూడెంలోని ఒక కేంద్రం అందులో 3 ఆపరేటర్లు, సూర్యాపేటలో రెండు కేంద్రాల్లో ఐదుగురు, యాదాద్రి భువనగిరి పట్టణంలో ఒక కేంద్రంలో 2 ఆపరేటర్లు పనిచేస్తున్నారు.

తక్కువ వేతనంతో ఇబ్బందులు పడుతున్నాం

మల్లేష్‌, పట్టణ సెంటర్‌ మేనేజర్‌

గత 20 సంవత్సరాలుగా కేంద్రంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చేరినప్పుడు రూ.1500 ఇచ్చారు. అప్ప టి నుంచి నేటి వరకు ఇందులోనే మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం అ న్ని ఫీఎఫ్‌ కటింగ్‌లు పోను రూ. 14,500 వ స్తుంది. జీతం అద్దెకు కుటుంబ పోషణకు కూ డా సరిపోవడం లేదు. పిల్లల చదువు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

20 సంవత్సరాలు వెట్టి చాకిరి

సరిత, ఆపరేటర్‌,నల్లగొండ

పురోగతి ఉంటుందని మీసేవా ఆపరేటర్‌గా చేరాను. 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా. ప్రజలకు ప్రభుత్వ పరమైన ఎన్నో సదుపాయాలు వారికి అందేలా చేస్తున్నాం. ప్రస్తుతం ఇస్తున్న వేతనం సరిపోవడం లేదు. ఇతర శాఖల్లో పనిచేసే వారికి మంచి వేతనం ఇస్తున్నారు. విస్తృతమైన సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలి.

Updated Date - Jan 16 , 2025 | 12:14 AM