Share News

EVM Issues: ఈవీఎంలపై అనేక అనుమానాలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:48 AM

దేశంలో జరుగుతున్న ఎన్నికలలో ఉపయోగిస్తున్న ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని, దొంగ ఓట్లు చేర్చి..

EVM Issues: ఈవీఎంలపై అనేక అనుమానాలు

  • దొంగ ఓట్లు చేర్చి నిజమైన ఓట్లు తొలగిస్తున్నారు

  • పలువురు వక్తల ఆరోపణ

పంజాగుట్ట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో జరుగుతున్న ఎన్నికలలో ఉపయోగిస్తున్న ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని, దొంగ ఓట్లు చేర్చి.. నిజమైన ఓట్లు తొలగిస్తున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. తెలంగాణ స్టేట్‌ డెమోక్రటిక్‌ ఫోరం (టీఎస్డీఎఫ్‌), జాగో నవ భారత్‌, ఓట్‌ నీడ్‌ గ్యారంటీ సంస్థల ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి- స్వతంత్ర ఎన్నికల కమిషన్‌’ అంశంపై టీఎస్డీఎఫ్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వినాయక్‌ రెడ్డి అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.


ఇందులో జస్టిస్‌ బి.చంద్ర కుమార్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌, వివిధ సంఘాలు, సంస్థల నాయకులు ప్రొఫెసర్‌ అన్వర్‌ ఖాన్‌, చలపతిరావు, జానాకీరాములు, పోటు రంగారావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని జస్టిస్‌ చంద్ర కుమార్‌ అన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 04:48 AM