అన్ని స్థానాలకు పోటీ
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:46 PM
నల్లగొండ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్‌రెడ్డి తెలిపారు.
నల్లగొండ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయ డానికి కార్యచరణ రూపొందించారని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీలన్నింటిని తమ రాష్ట్ర నాయకత్వం ప్రకటి స్తుందన్నారు. రెండున్నర నెలలుగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేపట్టినట్లు చెప్పారు. 50వేల సభ్య త్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 22వేల సభ్యత్వాలు పూర్తి అయ్యాయన్నారు. సభ్యత్వ నమోదులో కోదాడ నియోజకవర్గం ముందు వరు సలో ఉందన్నారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి లేదా రెండో స్థానంలో నిలపడానికి సభ్యత్వాలు పెద్దఎత్తున చేపడుతామ న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంవత్సరం పాటు గడువు ఇవ్వడం జరి గిందని ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతుభరోసా, రైతుబీమాతో పాటు రైతుల సమస్య లన్నింటిని ప్రభుత్వం పరిష్కరించాలని, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని కోరారు. జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం నాయకులు, కార్యకర్తలతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్‌కుమార్, తేలన్న రవి పాల్గొన్నారు.