Share News

నేడు జిల్లాకు సీఎం రాక

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:32 PM

ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీలు తమ అభ్యర్థుల కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి.

నేడు జిల్లాకు సీఎం రాక
సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభకు హాజరు

ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం....

-కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు

-ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీలు తమ అభ్యర్థుల కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీలు పోటాపోటీగా అగ్రనేతలను ఆహ్వా నిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌- మెదక్‌-నిజామా బాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు మంచి ర్యాలలో అధికంగా ఉండటంతో అగ్రనేతల చూపంతా ఇక్కడే కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి వూటు కూరి నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్‌ అంజి రెడ్డికి మద్దతుగా ఆయా పార్టీల నేతలు ముమ్మరం గా ప్రచారంలో పాల్గొంటున్నారు.

సమన్వయంతో ముందుకు...?

పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్‌ తరుపున విద్యా సంస్థల అధినేత, కరీంనగర్‌కు చెందిన నరేంద ర్‌రెడ్డికి క్రమంగా ఎమ్మెల్యేల నుంచి మద్దతు పెరుగు తోంది. అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా మంచిర్యా ల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వినోద్‌, గడ్డం వివేకా నందలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రచార సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే వినోద్‌ పాల్గొన్నారు. అప్పటి నుంచి వినోద్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు గా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. చెన్నూరు నియో జక వర్గంలోనూ అక్కడి ఎమ్మెల్యే వివేకానంద సైతం రెండు రోజుల నుంచి విరివిగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే మంచిర్యాల నియోజక వర్గంలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో కాం గ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానం తన అభ్యర్థి గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

భారీ సంఖ్యలోపట్టభద్రులు,

కాంగ్రెస్‌ శ్రేణుల తరలింపు...

కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మె ల్సీ ఎన్నికల ప్రచారం కోసం సీఎం రేవంత్‌రెడ్డి సోమ వారం మంచిర్యాలకు రానున్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగ ర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సార థ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో మ ధ్యాహ్నం 2 గంటలకు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళ న సభ ఏర్పాటు చేస్తుండగా సీఎంతోపాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ర వాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, తదితరులు హా జరుకానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ సంఖ్యలో పట్టభద్రులు, కాంగ్రెస్‌ శ్రేణులను తరలిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని 12వేల మంది పట్టభ ద్రులను సీఎం సమావేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తుండగా, ఆత్మీయ సమ్మేళన సభకు మొత్తంగా 30వేల మందిని తరలించనున్నారు.

సీఎం టూర్‌ షెడ్యూల్‌ ఇలా....

సోమవారం నాటి సీఎం టూర్‌ షెడ్యూల్‌ను ఆయ న పర్సనల్‌ సెక్రటరీ నర్మాల శ్రీనివాస్‌ విడుదల చేశా రు. రేవంత్‌రెడ్డి ఉదయం 11 గంటలకు బేగంపేట విమనాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయల్దేరి 11.45కు నిజామాబాద్‌ చేరుకుంటారు. అక్కడ సమా వేశా నంతరం 1.35కు బయల్దేరి నేరుగా మంచిర్యాల లోని సభాస్థలి వద్ద కు చేరుకుంటారు. మంచిర్యాలలో 2.20 నుంచి 3.55 వరకు పట్టభ ద్రులు, కాంగ్రెస్‌ శ్రేణులతో సమావేశంలో పాల్గొంటారు. సా యంత్రం 4 గంటలకు బయల్దేరి కరీంనగర్‌కు చేరుకుంటారు. మంచిర్యాలలో సమావేశానంతరం జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో నిర్మిస్తున్న వైకుంఠదామం ఏర్పా ట్లను సీఎం పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఐబీ చౌరస్తా సమీపంలోని నిర్మాణంలో ఉన్న మాతా శిశు, 350 పడకల ఆస్పత్రిని సైతం ముఖ్య మంత్రి పరిశీలించనున్నట్లు సమాచారం. సీఎం రాను న్న నేపథ్యంలో వైకుంఠదామంలో ఆహ్లాదకర వాతా వరణం ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:32 PM