Share News

CM Revanth Reddy: రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:53 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు తెలిసింది. మంగళవారం (15న) మధ్యాహ్నమే ఆయన ఢిల్లీ వెళతారని.. 16, 17 తేదీల్లోనూ అక్కడే ఉంటారని సమాచారం.

CM Revanth Reddy: రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌

  • పీవీ సంస్మరణ సభలో పాల్గొనే చాన్స్‌

  • అక్కడే ఏపీ సీఎం చంద్రబాబుతో వేదిక పంచుకోనున్న రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు తెలిసింది. మంగళవారం (15న) మధ్యాహ్నమే ఆయన ఢిల్లీ వెళతారని.. 16, 17 తేదీల్లోనూ అక్కడే ఉంటారని సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతో పాటు పార్టీ అధిష్ఠానంతో భేటీకానున్నట్టు తెలిసింది.


15న సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో.. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది.

Updated Date - Jul 14 , 2025 | 04:53 AM