Telangana Investments: సీఎం రేవంత్‌తో విన్ గ్రూప్ సీఈవో భేటీ
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:45 AM
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి విన్‌గ్రూప్ ఆసియా సీఈవో ఫామ్ సాన్‌చౌ ఆసక్తి వ్యక్తం చేశారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఆసక్తి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించిన సీఎం
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి విన్‌గ్రూప్ ఆసియా సీఈవో ఫామ్ సాన్‌చౌ ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను స్థాపించడానికి సంసిద్థత వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో సీఎం రేవంత్‌ను సాన్ చౌ కలిశారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ యూనిట్లు, బ్యాటరీ విద్యుత్ నిల్వ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు విన్‌గ్రూప్ ఆసక్తిగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్ 8-9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో పాల్గొనాలని ఫామ్ సాన్‌చౌతోపాటు విన్‌గ్రూప్ చైర్మన్ ఫామ్ వూంగ్‌లను రేవంత్ ఆహ్వానించారు.