Share News

CM Revanth Reddy: ఉద్దండాపుర్‌ భూనిర్వాసితులకు అండగా నిలిచాం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:00 AM

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండాపుర్‌ రిజర్వాయర్‌ భూనిర్వాసితులకు అండగా నిలిచామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: ఉద్దండాపుర్‌ భూనిర్వాసితులకు అండగా నిలిచాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండాపుర్‌ రిజర్వాయర్‌ భూనిర్వాసితులకు అండగా నిలిచామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే పరిహారం ఇచ్చి బాధితుల కన్నీళ్లు తుడుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఏడాదిన్నర కాలంలో 250 కోట్ల రూపాయల పరిహారం మంజూరు చేశామన్నారు.


గత నెలలో 25 కోట్లు విడుదల చేయగా, ఈ నెలలో మరో 175 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులతో సహపంక్తి భోజనం చేసి డిసెంబరు 9 లోపు పూర్తి పరిహారం అందిస్తామని తన మాటగా చెప్పాలని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి సూచించానన్నారు. తన ఆదేశాల మేరకు 6 వేల మందితో సహపంక్తిభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు

Updated Date - Aug 04 , 2025 | 04:00 AM