Share News

Lunar Eclipse: సెప్టెంబరు 7న సంపూర్ణ చంద్రగ్రహణం

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:35 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో సెప్టెంబరు 7న(ఆదివారం) చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ వేళల్లో మార్పులు చేశారు.

Lunar Eclipse: సెప్టెంబరు 7న సంపూర్ణ చంద్రగ్రహణం

యాదగిరిగుట్ట, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో సెప్టెంబరు 7న(ఆదివారం) చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ వేళల్లో మార్పులు చేశారు. రాత్రి 9.56 నుంచి 1.26 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో ప్రధానాలయం, అనుబంధ, ఉప ఆలయాల్లో మధ్యాహ్నం 12 గంటలలోపు నిత్య కైంకర్యాలు, నివేదనలు జరగనున్నాయి.


తదనంతరం ఆలయం ద్వార బంధనం చేస్తారు. తిరిగి 8న(సోమవారం) 3.30గంటలకు ఆలయం శుభ్రం చేసి సంప్రోక్షణ చేసి నిత్య కైంకర్యాలు నిర్వహించేందుకు ఆలయ వేళల్లో మార్పులు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల కోసం శ్రీగరుడ ట్రస్టు పేరుతో నూతన పథకం ప్రవేశపెట్టారు. భక్తులకు వసతి, దర్శన కూపన్లు ఇచ్చి సదుపాయాలతోపాటు బాండ్లు అందజేస్తారు.

Updated Date - Aug 31 , 2025 | 04:35 AM