Sampath : చాకలి ఐలమ్మ మనవడు సంపత్ మృతి
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:33 AM
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల సంపత్ (45) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు.
పాలకుర్తి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల సంపత్ (45) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు వారి స్వగ్రామం జనగామ జిల్లా పాలకుర్తిలో సోమవారం పూర్తయ్యాయి. చాకలి ఐలమ్మ రెండో కుమారుడు పిచ్చయ్యకు భార్య భారతమ్మ, నలుగురు కుమార్తెలుండగా, సంపత్ ఏకైక కుమారుడు.
తండ్రి పిచ్చయ్య మృతి చెందిన తర్వాత పదేళ్ల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లిన సంపత్ అక్కడ కొన్నాళ్లు ఎలక్ర్టీషియన్‌గా పని చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో మూడేళ్లుగా స్వగ్రామం పాలకుర్తిలోనే ఉంటున్నారు. సంపత్‌కు భార్య గౌరీశ్వరీ, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. సంపత్ సీపీఐ(ఎం)లో పనిచేశారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సంపత్ అంత్యక్రియల్లో ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.