కేంద్రం తెలంగాణపై వివక్ష మానుకోవాలి
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:36 PM
బీజేపీ ప్రభు త్వం బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై వివక్షతను మానుకో వాలని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా టీపీసీసీ అద్యక్షులు మహేష్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.

- జిల్లా డీసీసీ అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాల క్రైం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి) : బీజేపీ ప్రభు త్వం బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై వివక్షతను మానుకో వాలని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా టీపీసీసీ అద్యక్షులు మహేష్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో వివక్షను చూపిందన్నారు. ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా 12 లక్ష ల వరకు ఆదాయ పన్ను రాయితీ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. బి హార్‌లో ఎలక్షన్‌లు ఉన్నందుననే ఎక్కువ బడ్జెట్‌ను కేటాయిం చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి బీజేపీ మిత్రపక్షం కాబట్టే అధిక బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్ట ణ అద్యక్షులు తూముల నరేష్, నాయకులు చిట్ల సత్యనారా యణ, పూదరి తిరుపతి, ఉప్పలయ్య, రవి, ఆరిఫ్, పాల్గొన్నారు.
చెన్నూరు : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు సోమవారం చెన్నూరులోని అంబేద్కర్ చౌ రస్తా వద్ద ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ల దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షుడు గజ్జెల అంకాగౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం తెలంగాణపై వివక్ష చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి, చెన్నూరు మడలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.