Hyderabad: డ్రగ్స్ దందాలో 9 పబ్‌లకు ఈగల్ నోటీసులు
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:51 AM
హైదరాబాద్, సైబరాబాద్‌లోని 9 పబ్‌లపై సైబరాబాద్ నార్కోటిక్స్ వింగ్ ఈగల్ బృందాలు కేసు నమోదు చేశాయి.
హైదరాబాద్, జూలై10(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, సైబరాబాద్‌లోని 9 పబ్‌లపై సైబరాబాద్ నార్కోటిక్స్ వింగ్ ఈగల్ బృందాలు కేసు నమోదు చేశాయి. హైదరాబాద్‌లోని పబ్‌లలో ఏర్పాటు చేసిన రహస్య గదుల్లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు ఇటీవల పట్టుబడిన మల్నాడు కిచెన్ యజమాని సూర్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ప్రిజం పబ్, ఫార్మ్ పబ్, బర్డ్‌బాక్స్ పబ్, బ్లాక్22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్‌వే పబ్, క్వాక్ ఏరీనా పబ్, ఎక్స్‌రా పబ్‌లపై కేసులు నమోదు అయ్యాయి. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని పబ్ యాజమాన్యాలను అధికారులు కోరారు.