సంతకం చేయని అభ్యర్థి.. నామినేషన్ తిరస్కరణ
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:56 AM
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన నామినేషన్లలో ఒక నామినేషన్‌ను అధి కారులు తిరస్కరించారు.

సక్రమంగా 22 నామినేషన్లు
13వ తేదీన ఉపసంహరణకు గడువు
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన నామినేషన్లలో ఒక నామినేషన్‌ను అధి కారులు తిరస్కరించారు. ఈ నెల 3నుంచి 10వ తేదీవరకు స్వీకరించిన నామి నేషన్లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర పర్యా వరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్‌నదీమ్ సమక్షంలో జిల్లా కలెక్టర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలాత్రిపాఠి ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించారు. మొత్తం 23నామినేషన్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి తుండు ఉపేందర్ నామినేషన్ పత్రాలపై సంత కం లేని కారణంగా నామినేషన్‌ను తిరస్కరించారు. 22 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అఽధికారులు ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల ఉపసంహ రణకు గడువుకాగా, ఎంతమంది బరిలో ఉన్నారనేది తేలనుంది. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఉన్నారు.