అక్రమ రవాణాకు చెక్ పడేనా...?
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:18 PM
ఎల్లలు దాటిపోతున్న కలప, ఇతర అటవీ ఉత్పత్తులతోపాటు పీడీఎస్ బియ్యంపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు అట వీశాఖ ఆఽధ్వర్యంలో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటి వర కు అటవీ చెక్ పోస్టులు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయబోయే చెక్‌పోస్టులకు మాత్రం ప్రత్యేకత ఉంది.
అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టుల ఏర్పాటు
అంతర్రాష్ట్ర రవాణాపై ప్రత్యేక ధృష్టి
చెన్నూరు, కోటపల్లి మండలాల్లో టోల్‌గేట్లు ఏర్పాటు
వాహనానికి ఓ రేటు చొప్పున చెస్ వసూలు
త్వరలో ప్రారంభించేందుకు అధికారుల సన్నాహాలు
మంచిర్యాల, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఎల్లలు దాటిపోతున్న కలప, ఇతర అటవీ ఉత్పత్తులతోపాటు పీడీఎస్ బియ్యంపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు అట వీశాఖ ఆఽధ్వర్యంలో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటి వర కు అటవీ చెక్ పోస్టులు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయబోయే చెక్‌పోస్టులకు మాత్రం ప్రత్యేకత ఉంది. చెన్నూరు మండలం కిష్టంపేట, కోటపల్లి మండలం పారుపల్లి వద్ద అటవీశాఖ కొత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయనుండగా, వాటి పరిధిలో ప్రత్యేకంగా టోల్గేట్లు ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహ దారులపై కాంట్రాక్టరు ఏర్పాటు చేసిన విధంగా ఫారె స్టు పరిధిలో పయణించే వాహనాలకు అటవీశాఖ ప్రత్యేకంగా టోల్గేట్లు ఏర్పాటు చేయనుంది. టోల్ గేట్ల వద్ద పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రత్యేకంగా చెస్ వసూలు చేసేందుకు అధికారులు అవ సరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టోల్ గేట్ల వి షయమై ఇప్పటికే అటవీశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా.....
కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలోని ప్రాణ హిత నదిపై తెలంగాణ-మహారాష్ట్రలను కలుపుతూ అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం జరిగినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు విరివిగా పెరిగిపో యాయి. ఇదే అదునుగా వంతెన పై నుంచి కలప, రేషన్ బియ్యం, మద్యం, ఇతర వ్యాపార సంబంధిత అక్రమ రవాణా కూడా జోరుగా సాగుతోంది. దీంతో పోలీసు, అటవీశాఖ అంతర్రాష్ట్ర వంతెనపై పూర్తిస్థా యిలో ధృష్టిసారించాయి. వంతెనపై నుంచి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, అ క్రమ రవాణా కూడా జరుగుతోందన్న భావనలో అటవీశాఖ ఉంది. ప్రాణహిత నది మార్గంగా మహా రాష్ట్ర నుంచి తెలంగాణకు టేకు కలప విరివిగా అక్ర మ రవాణా జరుగుతోంది. ఇటీవల పెద్ద మొత్తంలో ప్రాణహిత నదిలో టేకు కలప పట్టుపడటమే దీనికి నిదర్శనం. అలాగే ప్రాణహితలో ప్రవాహం తగ్గుము ఖం పట్టినప్పుడల్లా రెండు రాష్ట్రాల నడుమ మావోల కార్యకలాపాలు ఊపందుకుంటుండటంతో దాన్ని అరి కట్టేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసుశాఖ గ తంలోనే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, నిఘా ముమ్మ రం చేయగా, అటవీశాఖ కూడా ఆ దిశగా పయనిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
వాహనాలకు పన్ను వసూలు..
రెండు రాష్ట్రాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధపడుతు న్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్ర మంలోనే చెన్నూరు అటవీ రేంజ్ పరిధిలో రెండు టోల్‌గేట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అడవుల సంరక్షణతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం పన్ను వసూలు చేయనున్నారు. భారీ వాహనాలకు రూ. 200, ఫోర్ వీలర్‌కు రూ. 50, త్రీ వీలర్‌కు రూ. 30 చొప్పున వసూలు చేయను న్నా రు. టోల్ గేట్ల ద్వారా లభించే ఆదాయంతో చెన్నూరు అటవీ డివిజన్ పరిధిలోని ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యంలో అడవుల సంరక్షణ, మొక్కల పెంప కం, వన్య ప్రాణులకు తాగునీటి వసతుల కల్పనతో పాటు అటవీ సంపద అభివృద్ధి చేయనున్నట్లు అధి కారులు చెబుతున్నారు. వంతెనపై నుంచి నిత్యం స గటున 200 వందల వరకు వివిధ రకాల వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. రోజుకు సగటున ఒక్కో వాహనానికి రూ. 50 చొప్పున వసూలు చేసినా, కనీ సం రూ. 10వేలు వసూలు అయ్యే అవకాశం ఉంది. నెల తిరి గే సరికి రూ. 3 లక్షల పై చిలుకు నిధులు సమకూరే అవకాశం ఉంది. అంత పెద్ద మొత్తంలో పన్ను వసూలు చేసేందుకు రంగం సిద్ధమైనప్పటికీ అంత రాష్ట్ర వంతెనపై నుంచి జరుగుతున్న అక్ర మ రవాణాకు అడ్డుకట్ట పడుతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పటిష్ట నిఘా ఏర్పాటు..
అటవీ టోల్‌గేట్ల నుంచి పయనించే వాహనాలపై సీసీ కెమెరా లతో పటిష్ట నిఘా ఉంచేందుకు అధికారులు సమాయత్తం అవుతు న్నారు. రెండు చెక్ పోస్టులలో బీట్, సెక్షన్ ఆఫీసర్ల స్థాయి అధికా రులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తుండగా, వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇంతవ రకు బాగానే ఉన్నా...వంతెన ద్వారా రెండు రాష్ట్రాల నడుమ రవాణా సౌకర్యం మెరుగుపడింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంత వా సులు తమ అవసరాలకు అంతరాష్ట్ర వంతెనపై నుంచి తెంగాణ లోని మంచిర్యాల, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు రా కపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు అటవీశాఖ ప్రత్యే కంగా టోల్‌గేట్లు ఏర్పా టు చేసి చెస్ వసూలు చేసేం దుకు సిద్ధపడుతుండటంతో వాహ నాలపై భారం పడే అవకాశం ఉంది.
స్థానిక వాహనాలకు మినహాయింపునిస్తున్నాం..
చెన్నూరు అటవీ రేంజ్ అధికారి శివకుమార్
అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే చెక్ పోస్టుల ద్వారా స్థానిక వాహనదారులకు మినహా యింపునిస్తున్నాం. చెన్నూరు ప్రాంత వాసులు చెక్ పోస్టుల గుండా ప్రయాణిస్తే వారికి పన్ను వసూలు చేయబోము. ఇందు కోసం స్థానిక వాహనాలను గుర్తించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అంతరాష్ట్ర వంతెనపై నుంచి రవాణా సాగించే భారీ వాహనాలు, వ్యాపార సంబంధిత రవాణాపై మాత్ర మే పన్ను విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో స్థానికు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.