Mahesh Kumar Goud Criticizes BJP: క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:15 AM
కులాలు, మతాల పేరిట బీజెపీ భవిష్యత్తు లేకుండా చేస్తోందని, క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు
బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఈసీ
మహే్‌షకుమార్ గౌడ్ ఆరోపణలు
హైదరాబాద్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కులాలు, మతాల పేరిట బీజెపీ భవిష్యత్తు లేకుండా చేస్తోందని, క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ ఆరోపించారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని జెండా ఆవిష్కరించారు. బీజేపీ దేశ రాజ్యాంగం మార్చాలని చూస్తుందని, రాజ్యాంగ సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందన్నారు. స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పోరాడిందని, దేశ రక్షణకు అదే దీక్షతో పని చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరాభవన్‌లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ గుండెకాయ లాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం ఉత్సాహంగా పని చేయాలన్నారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి ఎఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్‌పై రూపొందించినపవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను గాంధీభవన్‌లో ప్రదర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొన్నం, జూపల్లి, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు ఈ ప్రెజెంటేషన్‌ను చూశారు.