Ponnam Prabhakar: త్వరలో హైదరాబాద్, పుణ్యక్షేత్రాలకు
ABN , Publish Date - May 21 , 2025 | 05:46 AM
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ మరియు పుణ్యక్షేత్రాలకు త్వరలో బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ముంబైకి రెండు లహరి ఏసీ స్లీపర్ కోచ్ బస్సులు ప్రారంభించారు.
జిల్లా కేంద్రాల నుంచి బస్సు సర్వీసులు:పొన్నం
వేములవాడ కల్చరల్, మే 20 (ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు, అలాగే అన్ని పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి మంత్రి ముంబైకి లహరి ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు ప్రజల అభీష్టం మేరకే ముంబైకి బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ మధ్య ఆది శ్రీనివాస్ ముంబాయి పర్యటనకు వెళ్లిన తరుణంలో అక్కడి తెలుగువారు ఏసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరడంతో వెంటనే తన దృష్టికి తెచ్చారని, తెలుగు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఆలోచనతో 2 బస్సులను ఏర్పాటు చేశామని అన్నారు.