BRS: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై బురదజల్లే యత్నం
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:23 AM
రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన కేసీఆర్, ప్రజల పక్షాన పోరాడుతున్న కేటీఆర్, హరీశ్‌రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, పద్మాదేవేందర్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్‌కు పాలనపై శ్రద్ధ లేదు: బీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన కేసీఆర్, ప్రజల పక్షాన పోరాడుతున్న కేటీఆర్, హరీశ్‌రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, పద్మాదేవేందర్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం పేరిట మొన్న కేసీఆర్, హరీశ్‌ను విచారణకు పిలిపించారని, ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అంశంలో కేటీఆర్‌ను ఏసీబీ విచారణకు రప్పించారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అందాల పోటీల పేరుతో రూ.200కోట్లు వృథా చేయడం తప్ప చేసిందేముందని ప్రశ్నించారు. కాగా, ప్రతిపక్షాన్ని వేధించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సమయం వెచ్చిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై ఏ మాత్రం శ్రద్ధ లేదని బీఆర్‌ఎస్ నేతలు శ్రీనివా్‌సగౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ విమర్శించారు.