కొణతం దిలీప్ అరెస్టు
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:49 AM
బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి కొణతం దిలీప్ ను నిర్మల్ జిల్లా పోలీసులు బుధవారం అరె స్టు చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా నిర్మల్ పోలీసు స్టేషన్‌కు తరలింపు
నిర్మల్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి కొణతం దిలీప్ ను నిర్మల్ జిల్లా పోలీసులు బుధవారం అరె స్టు చేశారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు ఆయనపై లుక్ అవుట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం రాత్రి అమెరికా నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే నిర్మల్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని.. ఇక్కడి రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 2024లో దిలీప్ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై జిల్లాలోని పలు స్టేషన్‌లలో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదులు చేయగా..
పోలీసులు దిలీ్‌పపై కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో దిలీ్‌పకు స్టేషన్ బెయిల్ లభించింది. ఖానాపూర్‌కు సంబంధించి మాత్రం స్టేషన్ బెయిల్ రాకపోవడంతో పోలీసులు ఆయనను ఇక్కడి కోర్టు జడ్జి ముందు హాజరుపర్చారు. ఆయనకు నిర్మల్ సెషన్ కోర్టు న్యాయాధికారి భవిష్య బెయిల్ మంజూరు చేశారు.