BRS: బీఆర్‌ఎస్ బీసీ సభ వాయిదా
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:19 AM
ఈ నెల 14వ తేదీన కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించ తలపెట్టిన బీసీ సభ వాయుదా పడింది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ
ఈ నెల 14వ తేదీన కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించ తలపెట్టిన బీసీ సభ వాయుదా పడింది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ సభ తదుపరి నిర్వహణ తేదీని త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు.
క్షమాపణ చెప్పాకే సభపెట్టాలి: మేడిపల్లి సత్యం
రాష్ట్రంలోని బీసీలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే బీఆర్‌ఎస్ పార్టీ బీసీ సభ పెట్టుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హితవు పలికారు. పదేళ్ల పాలనలో బీసీలను పట్టించుకున్న పాపాన పోని ఆ పార్టీ నేతలకు బీసీ సభ పెట్టడానికి ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. ఒక వైపున ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వం ఉంటే.. మరో వైపున నిరుద్యోగులు, ప్రభుత్వం మధ్య అగాథాన్ని సృష్టించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్ ఆరోపించారు. అశోక్ అనే రాజకీయ శిఖండి డబ్బు సంపాదనకు రుచిమరిగి, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాడని విమర్శించారు. ఆయన బీఆర్‌ఎస్ పార్టీ ఏజెంట్ అని ధ్వజమెత్తారు.