Share News

BRS MLA Sanjay: ఆరోగ్యశ్రీపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే సంజయ్‌

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:43 AM

రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, త్వరితగతిన చర్యలు చేపట్టాలని శాసనసభలో ఆదివారం అల్లోపతిక్‌-2002 చట్టం రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కోరారు.

BRS MLA Sanjay: ఆరోగ్యశ్రీపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే సంజయ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, త్వరితగతిన చర్యలు చేపట్టాలని శాసనసభలో ఆదివారం అల్లోపతిక్‌-2002 చట్టం రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కోరారు. కోరుట్లలో 100 పడకల ఆస్పత్రి ఉన్నా సిబ్బంది లేరని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని, అవసరమైన మేరకు సిబ్బందిని కూడా నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ కోరారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైనచోట మౌలిక వసతులు కల్పించడంతో పాటు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కోరుట్లలోని ఆస్పత్రిలో సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ సేవల కింద చికిత్సలు అందించే ఆస్పత్రులకు సమయానికి బిల్లులు చెల్లించేలా ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.


అల్లోపతిక్‌-2002 చట్టం రద్దు

ఆంధ్రప్రదేశ్‌ అల్లోపతిక్‌ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల (రిజిస్ట్రీకరణ, క్రమబద్ధీకరణ) చట్టం-2002ను రద్దు చేస్తూ ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు.

Updated Date - Sep 01 , 2025 | 04:43 AM