Kavitha Comments On Santhosh: అన్న, నాన్నా.. వాళ్లతో జాగ్రత్త: ఎమ్మెల్సీ కవిత
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:28 PM
సొంత కుటుంబ సభ్యులపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సంతోష్ రావుకు ధన దాహానికి అడ్డు అదుపు లేదని.. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్ అనే అన్నారు. చేపించింది ఒకరైతే చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు వచ్చిందని అన్నారు.
Kavitha On Santosh Rao: సొంత కుటుంబ సభ్యులపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సంతోష్ రావుకు ధన దాహానికి అడ్డు అదుపు లేదని.. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్ అనే అన్నారు. చేపించింది ఒకరైతే చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు వచ్చిందని అన్నారు.
సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడు అని తనకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారని కవిత అన్నారు. రూ. 750 కోట్ల విల్లా ఎక్కడిదితనికి?. నవీన్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. హరీష్ రావు , సంతోష్ రావులు తలో వర్గం మేంటేయిన్ చేస్తూ కాంగ్రెస్ , బీజేపీ లతో కుమ్మక్కై బీఆర్ఎస్ ను ఓడిపోయేలా చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
నాన్న జాగ్రత్త!..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయేలా చేసిన వ్యక్తులు ఈ ఇద్దరే అని మండిపడ్డారు. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, కేటీఆర్ యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారని అన్నారు. హరీష్ రావు చేస్తున్న రాజకీయం చూసి నేర్చుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు. ఈ ఇద్దరినీ పార్టీలో ఉంచుకుంటే మిమ్మల్ని కూడా మింగేస్తారని కేసీఆర్ కు సూచించారు. వీరితో జాగ్రత్తగా ఉండాలనికేటీఆర్, కేసీఆర్ లకు ముందస్తు జాగ్రత్తలు చెప్పారు కవిత.