Share News

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:35 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వి ద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

 విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్‌
కొంపల్లి జడ్పీ హైస్కూల్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్‌

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడురూరల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వి ద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొంపల్లి జడ్పీహైస్కూల్‌లో రూ.50లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతుల నిర్మాణంతో పాటు వెదిర పూలమ్మ ఫౌండేషన ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మొదటి ప్రాధాన్యత వి ద్యకే ఇస్తానని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా మౌ లిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ అధికారి డి.నాగేశ్వర్‌రావు, యూత కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి, కొంపల్లి మాజీ సర్పంచ జాల వెంకన్నయాదవ్‌, వెదిర పూలమ్మ ఫౌండేషన చైర్మన మెగారెడ్డి, రామాలయ చైర్మన వెదిర విజయేందర్‌రెడ్డి, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చెన్నారెడ్డి, నాయకులు పాల్వాయి జితేందర్‌రెడ్డి, వట్టికోటి శేఖర్‌, అన్వర్‌, రత్నాచారి, అప్పారావు, మణియాదవ్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధిలో రాజీపడేది లేదు

మునుగోడు: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ పడేది లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు పట్టణంలోని తన సొంత క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నీటి వనరులపై విశ్రాంత ఇంజనీర్‌ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డితో సమీక్షించారు. శివన్నగూడెం ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి నీటి లభ్యత, ఆ ప్రాజెక్టు దిగువన ఉన్న సంస్థాననారాయణపురం, చౌటుప్పల్‌ మండలాలకు నీటి తరలింపు అంశాలపై చర్చించారు. ఈ ప్రాంతంలో చిన్ననీటి వనరుల అభివృద్ధి పరిచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా 122 చెరువులు, 18 చెక్‌డ్యాంలు, 19 సబ్‌ సర్పేస్‌ డైకులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచి బస్టాండ్లలో సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. మునుగోడు, చండూరు, నాంపల్లి మండలాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లను ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో నాలుగు చొప్పున మొత్తం 27 పాఠశాలలను మొదటి విడతలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 01:35 AM