ఓదెలలో మొదలైన బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:19 AM
ఓదెలలోని భ్రమరాంబ మల్లికా ర్జున స్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో అర్చకులు అగ్రోదకం, కృచ్చరణం, మహా గణపతి పూజ, గౌరీ పూజ, శివ పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణము, అఖండ దీప స్థాపన, అంకురార్పణ తదితర పూజలు నిర్వహించారు.

ఓదెల , ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఓదెలలోని భ్రమరాంబ మల్లికా ర్జున స్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో అర్చకులు అగ్రోదకం, కృచ్చరణం, మహా గణపతి పూజ, గౌరీ పూజ, శివ పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణము, అఖండ దీప స్థాపన, అంకురార్పణ తదితర పూజలు నిర్వహించారు. అలాగే మల్లన్న జాతరకు జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయంలో భక్తులు ఒగ్గు పూజా రులతో పట్నాలు వేయించి మొక్కులను తీర్చుకున్నారు. అలాగే భక్తులు కూడా కోడె మొక్కలు, మల్లన్న బోనాలను సమర్పించారు. ఆలయంలో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ సదయ్య ఆలయ అర్చకులు ధూపం వీరభద్రయ్య,భవాని, తోపాటు పలువురు పాల్గొన్నారు.
ఫ నేడు కల్యాణ మహోత్సవం
శైవక్షేత్రంలో సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి స్వామివారి కల్యాణతంతు ప్రారంభించనున్నారు. అలాగే ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి దర్శనం చేసుకునున్నట్లు ఈవో తెలిపారు.