Share News

గూడెంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:16 PM

దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయంలో గురువారం స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో స్వామివారి చిత్రపటాలను, పూజా సామగ్రిని సత్యదేవుడి సన్నిధి ప్రధానాలయం వరకు వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధాన ఆలయం వరకు తీసుకెళ్లి సత్యదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు.

  గూడెంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
స్వామివారి బ్రహ్మోత్సవాల పూజలతో వస్తున్న ఆలయ అధికారులు,అర్చకులు

దండేపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయంలో గురువారం స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో స్వామివారి చిత్రపటాలను, పూజా సామగ్రిని సత్యదేవుడి సన్నిధి ప్రధానాలయం వరకు వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధాన ఆలయం వరకు తీసుకెళ్లి సత్యదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి నిత్యవిధి, ప్రబోదిక ఆరగింపు, తీర్థ ప్రసాదాల గోష్టి, విశ్వకేనాధారణ, దీక్ష కంకణధారణ ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా జరిపించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు గోవర్దన రఘుస్వామి, సంపత్‌స్వామి, సురేష్‌స్వామి, వేధపండితులు దుద్దిళ్ల నారాయణశర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య బ్రహ్మోత్సవ కార్యక్రమాల పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాలను తిలకించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో సప్తహ భజన మండపంలో స్వా మి వారిని ప్రతిష్ఠించి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈభజనాలు వారం రోజుల పాటు కొనసాగునున్నాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు, భజనపరులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 10:16 PM