కన్నప్ప సినిమాను బ్యాన్ చేయాలి
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:07 AM
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, విడుదలకు ముందే ఆ సినిమాను బ్యాన్ చేయాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి.
పలు బ్రాహ్మణ సంఘాల డిమాండ్
మల్కాజిగిరి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, విడుదలకు ముందే ఆ సినిమాను బ్యాన్ చేయాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. నటుడు మంచు విష్ణు బ్రాహ్మణులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నాయి.
బుధవారం మల్కాజిగిరిలో విలేకరుల సమావేశంలో సనాతన ధర్మ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రియతం రామకృష్ణ, తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకులు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం, నెమలికంటి కృష్ణమూర్తి, గోటేటి కిషన్‌లు మాట్లాడుతూ.. బ్రాహ్మణుల ఆచారం ప్రకారం ప్రతీ బ్రాహ్మణునికి పిలక(జుట్టు) ఉంటుందని, దీన్ని అవహేళన చేస్తూ ‘పిలక గిలక’ అంటూ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాలో డైలాగ్‌లు ఉన్నాయని విమర్శించారు.