Street Dog Attack: రేబిస్‌తో బాలుడి మృతి
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:56 AM
వీధి కుక్క కరవడంతో రేబిస్ వ్యాధి సోకి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
కుక్క కాటును నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రులు
బీర్‌పూర్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్క కరవడంతో రేబిస్ వ్యాధి సోకి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రక్షిత్ (4) రెండు నెలల క్రితం ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క అతడిపై దాడి చేసింది. ఆ దాడిలో బాలుడు డ్రైనేజీలో పడిపోయాడు. డ్రైనేజీలో పడడం వల్లనే గాయాలయ్యాయి అని భావించిన తల్లిదండ్రులు కుక్క కాటును నిర్లక్ష్యం చేసి, స్థానికంగా చికిత్స చేయించారు.
రేబిస్ నివారణ కోసం టీకాలు వేయించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రక్షిత్‌లో రేబిస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడిని జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసినా మెరుగుపడకపోవడంతో, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే రక్షిత్ మరణించాడు.